May 17,2022 19:03

నా పేరు ఆద్య. నాలుగో తరగతి చదువుతున్నాను. ఈసారి వేసవి సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూశాను. ఎందుకంటే... ప్రతిసారీ ఒమ్మెవరంలో ఉన్న మా నానమ్మ, తాతయ్య వాళ్ల ఇంటికి వెళతాము. ఈ సారి సెలవులకు పంజాబ్‌లో ఉన్న మా పెద్దమ్మ వాళ్ల దగ్గరకు వెళ్లాలనేది ప్లాను. పంజాబు వెళ్లటానికి రైలులో ప్రయాణం చేశాం. కిటికి దగ్గర కూర్చుని రకరకాల దృశ్యాలు చూడడం చాలా బాగుంది. అక్కడికి వెళ్లాక పెద్దమ్మ వాళ్ల కుటుంబంతో కలిసి గోల్డెన్‌ టెంపుల్‌ను దర్శించాం. ఇది సిక్కు మతస్తుల అత్యంత ముఖ్యమైన దర్శనీయ క్షేత్రం. అందరూ చూడవచ్చు. ప్రజలందరూ కలిసి ప్రార్థనా చేసుకునేందుకు వీలుగా ఒక పెద్ద మందిరం ఉంది. దీనికి నాలుగు వైపులా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తర్వాత చండీఘర్‌ వెళ్లి రోజ్‌ గార్డెన్‌ చూశాం. అక్కడ రకరకాల గులాబీ పువ్వులు చాలా ఆహ్లాదకరంగా కనిపించాయి. అక్కడ నుంచి జూ పార్కు, రాక్‌ గార్డెన్‌, కురుక్షేత్ర వంటి ప్రదేశాలన్నీ తిరిగి చూశాం. సిమ్లా, ఢిల్లీ, ఆగ్రా వెళ్లి పర్యాటక ప్రదేశాలను సందర్శించాం. తిరిగి వస్తున్నప్పుడు అవి అన్నీ నా మనుసులో మరొకసారి కదలాడాయి. ఈ ప్రయాణం, సందర్శన నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. అందుకే ఈ వేసవి నాకు చాలా ప్రత్యేకం. ఫ్రెండ్స్‌.. మరి మీరు ఎక్కడికి వెళ్లారు? ఆ వివరాలు రాయండి.

 పిన్నేటి ఆద్య

- పిన్నేటి ఆద్య, 4 వ తరగతి,
పలుకూరు, కందుకూరు మండలం,
ఒంగోలు జిల్లా.