Jul 21,2021 19:15

నటి నభా నటేష్‌ ప్రస్తుతం నితిన్‌ సరసన 'మాస్ట్రో' చిత్రంలో నటిస్తోంది. గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో నభానటేష్‌ కథానాయికగా ఖరారు చేసినట్లు సమాచారం. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నభా నటేష్‌ కీలకపాత్రలో కనిపించనుందని సమాచారం.