
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త అమిత్ పాలేకర్ పేరును ఖరారు చేశారు. పాలేకర్ భండారీ కమ్యూనిటీకి చెందిన వారని తెలుస్తోంది. గోవా మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లోనూ ఆప్ పోటీ చేయనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు.. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా.. ఎంపిగా ఉన్న భగవంత్ మాన్ను కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి విదితమే.