
ప్రజాశక్తి - ఆలమూరు
వైసిపి ప్రభుత్వ హయాంలో పల్లెలను అభివృద్ధి పథనా నడిపించేందుకు చర్యలు చేపట్టామని ప్రభుత్వ విప్, ఎంఎల్ఎ చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పినపల్లలో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ చిర్ల మాట్లాడుతూ గ్రామాల్లో కరోనా లాక్ డౌన్ కారణంగా అసంపూర్తిగా నిలిచిపో యాయన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎల్ఎలు అందరూ సిఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి అపరిష్కతంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు అనుమతులు పొందడం జరిగిందన్నారు. దీంతో ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేసి గ్రీన్ సిగల్ ఇచ్చారన్నారు.ఇక గ్రామాలకు మహర్దశ పట్టనుందన్నారు. అలాగే ఈ గ్రామానికి గతంలో బిసి కల్యాణ మండపానికి రూ.5 లక్షలు మంజూరు చేశామన్నారు. అలాగే మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి అప్పట్లో మొదలుపెట్టిన కల్యాణ మండపానికి ఎంపీ గ్రాంట్ నిధులు రూ.5 లక్షలు, మండలపరిషత్ నుండి రూ.5 లక్షలు మాజురు చేయడం జరిగిందన్నారు. ఆశయాలకు అనుగుణంగా త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తయిలా చర్యలు తీసుకుని గ్రామాన్ని స్వర్గీయ చినకాపు ఆశించినట్టుగా తీర్చిదిద్దు తామని ఎంఎల్ఎ చిర్ల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తోరాటి లక్ష్మణ్‌రావు, మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్, జెడ్ పిటిసి సభ్యుడు తోరాటి సీతామహాలక్ష్మీ రాంబాబు, రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకరరావు, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ యణమదల నాగేశ్వరరావు, చామకురి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.