
శింగరాయకొండ : శింగరాయకొండ మండలం పాకల గ్రామం చెల్లెమ్మ పాలెంలో భీం ధీక్ష కార్యక్రమంలో భాగంగా స్వేరో సర్కిల్ వారి ఆధ్వర్యంలో గ్రామాస్తులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్వేరో సర్కిల్ రాష్ట్ర కో కన్వీనర్ డాక్టర్ స్నేహలత మాట్లాడుతూ అక్షరం - ఆరోగ్యం-ఆర్థికం గురించి గ్రామ ప్రజలకు వివరించారు. బిఆర్. అంబేద్కర్ ఆశయాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్‌ఎస్.ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరో సర్కిల్స్‌ను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, పిల్లలు ఉత్సాహంతో మద్దతు తెలిపారు. త్వరగా తమ గ్రామంలో స్వేరో సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్వేరో సర్కిల్ జనరల్ సెక్రటరీ పొనుగోటి ప్రభాకర్, మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ పి.జ్యోతి, జిల్లా పాధ్యక్షురాలు ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు.