May 17,2022 23:40

ఫొటో : గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న గ్రంథాలయ పాఠకులు

ఫొటో : గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న గ్రంథాలయ పాఠకులు
గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం
ప్రజాశక్తి - కావలి : విద్యార్థులు వేసవికాలంలో గ్రంథాలయాలను సందర్శించి జ్ఞాన సంపదను పెంచుకోవాలని కావలి గ్రంథాలయ అధికారి జి.సునీత పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని వెంగళరావునగర్‌లోని శాఖా గ్రంథాలయంలో రాష్ట్ర పౌరగ్రంథాలయ శాఖ ఆదేశాల మేరకు వేసవి విజ్ఞాన శిబిరాన్ని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎం.మాలకొండారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థులు గ్రంథాలయాలను సందర్శించి, పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
ముఖ్యంగా కథలు, కవితలు, దేశ నాయకుల జీవితచరిత్రలు, మొదలగు పుస్తకాలు చదవడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను గ్రంథాలయాలకు పంపి, పుస్తక పఠనాన్ని ప్రోత్సహించే విధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ ఉద్యోగి ఎస్‌.శశిబాబు, బాలబాలికలు, గ్రంథ పఠనాభిలాషులు, ప్రజలు పాల్గొన్నారు.