Jun 21,2021 20:20

ప్రజాశక్తి - ఆచంట
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి పేదల పెన్నిధిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని ఎఎంసి ఛైర్మన్‌ సుంకర ఇందిరా సీతారాం అన్నారు. ఆచంట, కొడమంచిలి, భీమలాపురం, ఆచంట వేమవరం గ్రామాల్లోని జగనన్న కాలనీల్లో సోమవారం సామూహిక శంకుస్థాపనలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇందిరా సీతారాం మాట్లాడుతూ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున జగనన్న కాలనీలో శంకుస్థాపన చేయడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. సర్పంచి సీతారాం మాట్లాడుతూ సతీ లీలావతిలో తాగునీటి బోరు పైపు లైన్ల కోసం రూ.12 లక్షలు, విద్యుత్‌ నిర్మాణం రూ.19 లక్షలు మంత్రి కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట సరోజినీ వెంకటేశ్వరరావు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్‌ కుమార్‌, తహశీల్దార్‌ మధుసూదనరావు, ఎంపిడిఒ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పోడూరు : వేడంగి గ్రామంలోని వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కవురు శ్రీనివాస్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుంటూరి పెద్దిరాజు, పోడూరు మండల కన్వీనర్‌ గణపతిరాజు, సర్పంచి చెల్లుబోయిన పద్మ పాల్గొన్నారు.