Jun 02,2023 00:06

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌

ప్రజాశక్తి- దొనకొండ : జగనన్న కాలనీ లేఅవుట్ల లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పించి గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గురువారం హౌసింగ్‌పై స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిల్లుల సమస్యలు, గృహాల మంజూరులో ఎదురవుతున్న సాంకేతిక లోపాలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అనంతరం గృహ నిర్మాణంకోసం లబ్ధిదారులకు స్త్రీనిధి ద్వారా రుణాలు అందజేశారు. అనంతరం వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. వాలంటీర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం వెంకటేశ్వరు, సర్పంచి కొంగలేటి గ్రేస్‌రత్నకుమారి, ఎంపిపి బొరిగొర్ల ఉషామురళీ, వైస్‌ ఎంపిపి వడ్లమూడి వెంకటేశ్వర్లు, మిట్టా కోటిరెడ్డి, తహశీల్దారు కె.వెంకటేశ్వరరావు, ఎంపిడిఒ వి.వసంతరావు నాయక్‌, హౌసింగ్‌ డిఇ నిరీక్షణరావు, నాయకులు కందుల నారపురెడ్డి, గొంగటి శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.