Feb 06,2023 23:22

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌

ప్రజాశక్తి-పరవాడ
మండలంలోని 14 సచివాలయాల పరిధిలో ఉన్న గృహ సారధులకు వెన్నలపాలెం ఎసి కళ్యాణమండపంలో సోమవారం పరవాడ మండల కన్వీనర్‌ వెన్నెల సన్యాసిరావు ఆధ్వర్యంలో సోమవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో పని చేయాలని ఉద్దేశంతో ఇటీవల నియమించిన గృహ సారధులకు పార్టీ శిక్షణ కార్యక్రమ నిర్వహిస్తుందని చెప్పారు. ఈనెల 11 నుండి ప్రారంభం కానున్న ''మా నమ్మకం నువ్వే జగన్‌'' అనే కార్యక్రమం ద్వారా గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు సహాయంతో తమ పరిధిలో గల ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి అన్నంరెడ్డి అజరు రాజ్‌, ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, వైస్‌ ఎంపీపీ బూస అప్పలరాజు, సర్పంచ్‌లు సిరిపురపు అప్పల నాయుడు, చింతకాయల సుజాత ముత్యాలు, పెదిశెట్టి పూజ శేఖర్‌, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు తదితరులు పాల్గొన్నారు.