Nov 29,2021 22:25

సర్పంచ్‌కి విరాళం అందిస్తున్న కడగల

ప్రజాశక్తి- నెల్లిమర్ల: మండలంలోని మధుపాడ గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి ఎయిమ్స్‌ విద్యా సంస్థల అధినేత, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కడగల ఆనంద కుమార్‌ విరాళం అందజేశారు. సోమవారం ఆ గ్రామ సర్పంచ్‌ నల్లం అప్పారావుకి రూ.లక్ష చెక్కును అందించారు. ఆనంద్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లం శ్రీను, కోరాడ శ్రీను, మధుపాడ గ్రామ పంచాయతీ నాయకులు పాల్గొన్నారు.