Jul 22,2021 06:50

యువత అతి చిన్న వయస్సులోనే తెలిసో తెలియకో గుట్కా, పాన్‌ పరాగ్‌, మాణిక్‌ చంద్‌ వంటి దురలవాట్లకు లోనై చేజేతులారా తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ధూమపానాన్ని ఎలాగో నిషేధించరు. ఎందుకంటే వాటి మీద వచ్చే ఆదాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బడిముబ్బడిగా సమకూరుతుంది కాబట్టి. కనీసం గుట్కా, పాన్‌ పరాగ్‌, జరదా పాన్‌ వంటి వాటిపై కూడ పూర్తి స్థాయి నిషేధం అమలు పరచకపొతే ప్రత్యేకంగా ఎంతో ఉజ్వల భవిష్యత్‌ వున్న యువత అనారోగ్యం పాలు కావడమే కాదు. వారి శరీరం క్యాన్సర్‌ వంటి భయంకర వ్యాధులకు నిలయం అవుతున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేసే వీటిపై, వీటి నిర్వాహకులపై యుద్ధ ప్రాతిపదికన ఉక్కు పాదం మోపాలి.
- బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచెర్ల, కర్నూలు జిల్లా.