
ప్రజాశక్తి - కశింకోట : కశింకోటలో లింగ వివక్షతపై ర్యాలీ శనివారం నిర్వహించారు ఈసందర్భంగా మండల ఉపాధ్యక్షులు పెంటకోట జ్యోతి మాట్లాడుతూ జెండర్ క్యాంపెన్. లింగ ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా గ్రామ స్థాయిలో స్వయం సహాయక సంఘాలలో మహిళలకు, బాలికలకు వారికి భయం వివక్ష లేకుండా సమాజంలో గౌరవ ప్రదమంగా జీవితాలు ను గడపడానికి వారి శక్తి సామర్ధ్యాలను పెంపొందించి కోవాలి అని అన్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు అక్రమ రవాణా అరికట్టాలి లింగ వివక్షతను నిర్ములించాలి. మహిళలపై హింసను అరికట్టాలి. మహిళలపై చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. మహిళలు రక్షణ మన అందరి బాధ్యత ఆడపిల్లలుని 18సం. నిండిన తర్వాతే పెళ్లి చేయాలని అన్నారు. ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంత్రి జయరజనీ , ఏ పి ఎం ఎస్ శ్రీనివాసరావు పంచాయతీ ఆఫీసర్ రమేష్ సీసీ సత్యనారాయణ వార్డు మెంబెర్లు వెలుగు వి ఓ ఏ లు సచివాలయంలో సిబ్బంది డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.