
గూర్‌గావ్ : బెంగళూరులోని సామ్‌సంగ్ ఒపేరా హౌస్‌లో ఆగస్టు 10న సాయంత్రం గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంటులో సామ్‌సంగ్ తన తర్వాత తరం ఫోల్డబుల్ (మడత) స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ కోసం వినియోగదారులు తమ స్టోర్లలో రూ.1,999 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. డెలివరీ అనంతరం రూ.5వేల విలువ చేసే అదనపు ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు తెలిపింది.