
ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లావ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ను ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాల హితకారిణి సమాజం ట్రస్ట్ చైర్మన్ కాశి బాల మునికుమారి ఆధ్వర్యంలో కోటి పల్లి బస్టాండ్ వద్దగల ఫ్రీడం పార్క్‌ను సందర్శించారు. ట్రస్ట్ డైరెక్టర్లు డి.సరితా రాణి, గుడాల ఆదిలక్ష్మి ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాఘవకుమారి, ఎన్‌సిసి ఆఫీసర్ కళాశాల మేజర్ డాక్టర్ బి. కళ్యాణి, ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్స్ వి.ఉమాజ్యోతి, కె.చిన్నిబాబు, ఎం.కాస్మా పార్కులోని స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమర యోధుల చరిత్ర తెలుసుకుని, స్ఫూర్తి పెంచుకోవాలని చెప్పారు. పెరవలి మండలం ముక్కామల శాఖా గ్రంథాలయంలో స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర పుస్తకాలను, బాల సాహిత్య పుస్తకాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అభివద్ధి కమిటీ సభ్యులు మద్దిపాటి సత్యనారాయణ, బోళ్ల మంగారావు పాల్గొన్నారు ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సూపర్‌వైజర్లు శ్రీనివాసరావు, కెడివిఎల్.కుమారి, సుభాషిణి, నాగమణి, వెంకట్రాజు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. గోపాలపురంలో ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, ఎంపిడిఒ ఆర్.శ్రీదేవి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం నుంచి చెక్ పోస్ట్ సెంటర్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కూసం రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ముల్లంగి శ్యామసుందర్ రెడ్డి, సూపరిటెండెంట్ రాజమనోహర్, ఇఒపిఆర్‌డి జోగేశ్వరరావు, పూజిత, అనిల్ పాల్గొన్నారు.