Oct 03,2022 22:55

ప్రజాశక్తి -మండపేట /కపిలేశ్వరపురం
దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం దుర్గాష్టమి సందర్భంగా స్థానిక కొండపల్లి వారి వీధిలోని దుర్గాదేవి ఆలయంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పతివాడ నూక దుర్గరాణి, వైసిపి నాయకులు తోట పృథ్విరాజ్‌, కో ఆప్షన్‌ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ, కొప్పిరెడ్డి పద్మావతిలు సోమవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీ మాలదారులు ఈ సందర్భంగా నిర్వహించిన అగ్ని గుండం కార్యక్రమంలో పాలొన్నారు. కార్యక్రమంలో సాధన శివభగవాన్‌, కమిటీ సభ్యులు బోనపు రెడ్డి, పెద్దకాపు, గోపిరెడ్డి కృష్ణ, రిమ్మలపూడి రామరాజు, చౌదరి, నిమ్మల పూడి వినాయక రావు, తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల్లో భవానీ మాల ధారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగుల చెరువు గ్రామంలో గ్రామానికి చెందిన చొల్లంగి సురేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన భవానీ మాలధారులు భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం భారీగా ఏర్పాటు చేసిన 12 అడుగుల అగ్ని గుండాన్ని తొక్కారు