Jul 03,2022 23:43

గీతంలో ఎంవివిఎస్‌.మూర్తి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న సిబ్బంది

విశాఖపట్నం: గీతం విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు, పార్లమెంట్‌ మాజీ సభ్యులు కీర్తిశేషులు డాక్టర్‌ ఎమ్‌వివిఎస్‌.మూర్తి 84వ జయంతిని ఆదివారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. విశ్వవిద్యాలయం ఆవరణలోని మూర్తి విగ్రహం వద్ద గీతం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎమ్‌.గంగాధరరావు, ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌వారియర్‌, కేంపస్‌ లైఫ్‌ ప్రో-వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు, చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ ఎన్‌.క్రిష్‌, లా కళాశాల డీన్‌ అనితారావు, గీతం మేనేజ్‌మెంట్‌ డీన్‌ అమిత్‌భద్ర, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఎమ్‌.శరత్‌చంద్రబాబు, స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ డైరక్టర్‌ మోహన్‌, ఫిజియోథెరపి డైరక్టర్‌ డాక్టర్‌ మాధురీ ఖాశీ, హెచ్‌.ఆర్‌ డైరక్టర్‌ సాంబమూర్తి, డైరక్టర్లు, బోధన, బోధనేతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
విశాఖపట్నం : ప్రేమ సమాజం, మాధవధార వుడా కాలనీలోగల సీనియర్‌ సిటిజన్‌ హోమ్‌, భీమునిపట్నంలోని సద్గురుసాయి వృద్ధాశ్రమంలో తెలుగుదేశం పార్లమెంటరీ ఇన్‌ఛార్జి శ్రీ భరత్‌ అన్నదానం ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్‌ ఇన్‌ఛార్జ్‌ గండి బాబ్జీ, కోరాడ రాజబాబు, గొల్లు సూర్యనారాయణ, పివి రామారెడ్డి, మూల రాము తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ : ఎంవివిఎస్‌ మూర్తి అజాత శత్రువు అని పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండి బాబ్జి అన్నారు. టిడిపి కార్యాలయంలో మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిబద్దత కలిగిన రాజకీయ వేత్త మూర్తి అన్నారు. పార్టీ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌ మాట్లాడుతూ, పార్టీకి పెద్ద దిక్కుగా మూర్తి చేసిన సేవలు ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ, ఉపాధ్యక్షుడు పైల ముత్యాల నాయుడు, ఆళ్ల శ్రీనివాసరావు, గాడు అప్పలనాయుడు, కొయిలాడ వెంకట్‌, శ్రీనివాసరావు, తమ్మిన విజరు కుమార్‌, ముల్లేటి కుమార్‌ స్వామి, పొడుగు కుమార్‌, కోట నరేష్‌, బొట్ట పరదేశి యాదవ్‌, బి.త్రినాధరావు, రామిరెడ్డి, పి.మురళి పాల్గొన్నారు.
ఎంవివిఎస్‌ మూర్తికి నివాళి
ప్రజాశక్తి- భీమునిపట్నం : ఎంపీగా, ఎమ్మెల్సీగా పలు పదవులు నిర్వహించిన కీర్తిశేషులు ఎంవివిఎస్‌ మూర్తి సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన చిత్ర పటానికి స్థానిక టిడిపి నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక చిన్న బజారులో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎంవివిఎస్‌ మూర్తి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజక వర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు మాట్లాడుతూ, ఎంవివిఎస్‌ మూర్తి పార్టీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, నాయకులు ఎం.సంజీవ్‌ కుమార్‌, వి.పోతురాజు, ఆదర్శ హిందీ ప్రేమీ మండలి అధ్యక్షులు కెఎస్‌ఆర్‌ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
నిడిగట్టులో అన్నదానం
ఎంవివిఎస్‌ మూర్తి జయంతి సందర్భంగా జివిఎంసి నాలుగో వార్డు పరిధి నిడిగట్టులోని వృద్ధాశ్రమంలో కోరాడ రాజబాబు ఆర్థిక సాయంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు పార్టీ అధ్యక్షులు పాసి నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, నాయకులు కారి అప్పారావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.