Oct 03,2022 19:20

మాట్లాడుతున్న దేవ సహాయం

ప్రజాశక్తి - గోనెగండ్ల
మండలంలోని వివిధ గ్రామాల్లో కెవిపిఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణలు చేపట్టారు. గాజులదిన్నెలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు దేవసహయం, పెద్దనేలటూరు, కులుమాల గ్రామాల్లో కెవిపిఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి బి.కరుణాకర్‌ సోమవారం జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కెవిపిఎస్‌ రాజీలేని పోరాటాలు చేస్తోందని చెప్పారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులాన్ని, మతాన్ని అడ్డంపెట్టుకుని దళితులపై అత్యాచారాలు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. దళితులు హక్కులు సాధించుకునేందుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. గాజులదిన్నె నాయకులు పెద్ద కర్రెన్న, ఆదాం, చిన్న కర్రెన్న, సంజన్న, పెద్దనేలటూరు నాయకులు చిన్న దస్తగిరి, నాగరాజు, శివన్న, పెద్దయ్య, కులుమాల నాయకులు దేవరాజు, తాయప్ప, కాలేబు, తిక్కయ్య, ఏసన్న, సుధాకర్‌, నిత్యానందరాజు పాల్గొన్నారు.