Jul 03,2022 22:24

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌, పెద్దాపురం సర్పవరం జంక్షన్‌ బోట్‌ క్లబ్‌ వాకర్స్‌ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం భారతీయ క్రైస్తవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సువర్ణ రాజు మాట్లాడుతూ యేసు క్రీస్తు 12 మంది శిష్యులలో ఒకరైన తోమా క్రీస్తు సువార్తను క్రీస్తు శకం 72వ సంవత్సరంలో జూలై 3న భారతదేశానికి తీసుకువచ్చారని అన్నారు. భాష, ఆచారం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా భారతీయ సంస్కృతిలో భాగంగా అందరితో క్రైస్తవ దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్‌ సౌజన్యంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుమార యాదవ్‌, రాజా, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.  భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా క్లాప్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో పెద్దాపురంలోని స్థానిక దర్గా పేటలోని మన ఇల్లు వద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్‌ ఇమ్మానియేల్‌ రాజు కుమారుడు జి.మోసెస్‌ దాస్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ లంక పురుషోత్తం దాస్‌, కాకినాడ జిల్లా జాయింట్‌ సెక్రెటరీ డాక్టర్‌ సిబిఐ సుకుమార్‌, క్లాప్స్‌ ప్రెసిడెంట్‌ డిపి డికె.జార్జి మోషేన్‌, జాయింట్‌ సెక్రటరీ ఎం.సుధాకర్‌, కోశాధికారి డిఎస్‌పి రావు, టి.కృపావరం, ఎం.సత్యకుమార్‌, జి.సత్యానందం, తలారి విజరు కుమార్‌, పి.ఏసేబు, డేవిడ్‌రాజ్‌, శాంతిరాజ్‌ పాల్గొన్నారు.