Jul 22,2021 00:54

స్టోర్‌ను ప్రారంభిస్తున్న హరి వెంకట కుమారి

పిఎం.పాలెం : మధురవాడ ప్రాంతంలోని మారికవలస జాతీయ రహదారి సమీపంలో మెట్రో హోల్‌సేల్‌ స్టోర్‌ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. దేశంలో 29వ స్టోర్‌గా విశాఖ నగరంలో నెలకొల్పిన ఈ స్టోర్‌ను జివిఎంసి మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచి సేవలు అందించాలన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖలో పెద్ద స్థాయి స్టోర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్టోర్‌ వల్ల 500 మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎపిలో విజయవాడలోనూ తమకు స్టోర్‌ ఉందని చెప్పారు. మెట్రో స్టోర్‌ వారి బి2బి ఇ - కామర్స్‌ యాప్‌ ద్వారా వర్తకులు, కిరాణా ఖాతాదారులు ఆన్‌లైన్‌లో సరుకులు ఆర్డరు చేసుకోవొచ్చన్నారు. అంతేకాక జిపిఎస్‌ సదుపాయమున్న ట్రక్కుల ద్వారా సరుకులను వినియోగదారుల ఇంటి వద్దకే డెలివరీ చేస్తామన్నారు.