
ప్రజాశక్తి-పిఠాపురం సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక బైపాస్ రోడ్డులోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో గురువారం సిఐటియు జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు నాయకులు కె.చిన్న, డి.సత్యనారాయణ ఆధ్వర్యాన నిర్వహించిన సభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.శేషబాబ్జి మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కార్మికుల హక్కులపై తీవ్రమైన నిర్బంధాలు పెడుతున్నారరన్నారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని అడిగే వారిపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పోరాటాలు చేసి ఆవిర్భవించిన సిఐటియు ఆధ్వర్యంలో సంఘటితంగా కార్మికులు, ఔట్ సోర్సింగ్ వర్కర్లు పోరాటం చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కార్మికులకు కనీస అవసరాల కోసం ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.వీరబాబు, ఎం.సూరిబాబు, కె.రమణ, టి.కిరణ్, డి.గోపాలకృష్ణ, రాంబాబు, ఎం.శ్రీను, జి.మాణిక్యాలరావు, బి.అప్పారావు, అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.