May 29,2023 21:25

పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీవాధీంద్ర తీర్థుల స్వర్ణ రథోత్సవం

ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో పూర్వపు పీఠాధిపతులు శ్రీవాధీంద్ర తీర్థుల ఆరాధనను పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు ఘనంగా నిర్వహించారు. సోమవారం శ్రీగురు రాఘవేంద్ర స్వాముల వారి ముని మనుమలు శ్రీవాధీంద్ర తీర్థుల ఆరాధన సందర్భంగా ఆయన బృందావనాన్ని నిర్మాల్యం చేసి తులసి అర్చన, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం బృందావనాన్ని స్వర్ణకవచాలతో, పట్టు వస్త్రాలతో వివిధ పుష్ప హారాలతో అలంకరిచారు. పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు ఆయన బృందావనాన్ని దర్శించుకుని మంగళ హారతులు ఇచ్చారు. ఆయన చిత్రపటాన్ని స్వర్ణ రథోత్సవంపై ఉంచి పీఠాధిపతులు పుష్పాభిషేకంతో మంగళ హారతులు ఇచ్చి మేళ తాళాలు, మంగళ వాయిధ్యాల నడుమ శ్రీమఠం ప్రాకారంలో వైభవంగా ఊరేగించారు. శ్రీమఠం మేనేజర్లు వెంకటేష్‌ జ్యోషి, ఎస్‌కె.శ్రీనివాసరావు, ఆధ్యాత్మిక అభివృద్ధి అధికారి శ్రీపతి ఆచార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపి.నరసింహ మూర్తి, సహాయక పిఆర్‌ఒ హొన్నొళ్లి వ్యాసరాజాచార్‌ పాల్గొన్నారు.