Jul 26,2021 06:18

ఒక్క ముక్కతో
తప్పు తల తెగిపడేలా
దూసుకొచ్చిన తీర్పు
ఓ అడ్డుపుల్లకు మరోచోట బోనెక్కితే?

కట్టలు తెంచుకోలేని గొంతుకు
గంతెలు కన్నీరు పెడుతుంటే
బరువును తూచలేని త్రాసుతో
విలువ తూలిపడుతుంటే ...
మళ్ళీ నల్ల కోట్ల తెల్లని నటన
ఎర్రని వాదన
పుట్టిన బిడ్డని కడుపులోకి నెట్టి
మళ్ళీ కనమన్నట్లుగా ...
- చందలూరి నారాయణరావు
97044 27247