Jun 21,2022 09:19

గోనెగండ్ల: డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించిన 23ఏళ్ల తరువాత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామకం జరిగింది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహళ్లికి చెందిన బి.నాగరాజును తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ చదివించారు. 1990లో బీఈడీ పూర్తి చేసిన ఆయన 1994, 1997 డీఎస్సీల్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. 1998 డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించారు. ఎంపికైన వారి జాబితాలో నాగరాజు పేరు ఉంది. అయితే అప్పట్లో డీఎస్సీ ప్రక్రియపై వివాదం రావడంతో.. అది న్యాయస్థానంలో ఉండిపోయింది. ఏళ్లు గడిచినా తీర్పు రాకపోవడంతో... స్వగ్రామానికి వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు నాగరాజుకు 55 ఏళ్లు... 1998 డీఎస్సీ వివాదాలు వీడటంతో ఎంపికైన వారి నియామకాల దస్త్రంపై తాజాగా సీఎం సంతకం చేశారు.