Nov 25,2022 15:44
  • శ్రీ చైతన్య పాఠశాల స్వామి వీధిలో విజయవంతం.    

ప్రజాశక్తి- పుత్తూరు టౌన్ : పట్టణంలోని స్థానిక శ్రీ చైతన్య. పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే జరిగింది. ఈ సందర్భంగా ఏ జీ ఎం డాక్టర్ శ్రీనివాసులు  తన సందేశంలో  విద్యార్థులలో సత్సంబంధాలు, కుటుంబ వ్యవస్థ కనుమరుగవ్వకుండా ఉండాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కో-ఆర్డినేటర్ అకాడమిక్ బాలాజీ గ్రాండ్ పేరెంట్స్ దుస్సాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రవి కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులలో అమ్మ నాన్నల అనుబంధం. అమ్మమ్మ, నానమ్మల అనురాగం. తాతయ్య లాలన గురుభక్తి, శిష్యానురక్తి అలవర్చుకోవడానికి చేసే చిరు ప్రయత్నం అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నృత్యం, వాక్చాతుర్యం విచ్చేసిన పెద్దలందరిని ఆకట్టుకున్నాయి. పేరెంట్స్ ఆనందంతో వారి మనోభావాలను వ్యక్తపరిచారు. ఫ్రీ ప్రైమరీ ఉపాధ్యాయ బృందంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.