Jun 03,2023 01:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సిద్ధం చేసింది. మొత్తం 111 పోస్టుల భర్తీకి ఈ నెల 10 వరకు ఉదయం 10 నుంచి 1 గంట వరకుపరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,455 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు అర్హత సాధించారు. 10 ప్రాంతాల్లో 11 పరీక్ష కేంద్రాలను కమిషన్‌ ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం, విశాఖపటుం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కరూులులో పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అనిు పరీక్ష కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8:30 నుంచి 9:30లోపు చేరుకోవాలి. 15 నిమిషాలు గ్రేస్‌ పిరియడ్‌ ఉంటుంది. 9:45 నిమిషాల లోపు పరీక్ష కేంద్రం వద్ద ఉన్నవారికి మాత్రమే అనుమతి. ఆ తరువాత అనుమతి లేదు. అభ్యర్థులు బయోమెట్రిక్‌ రిజిస్ట్రేషన్‌, ఫేస్‌ రికగుేజేషన్‌ను పరీక్ష కేంద్రాల్లో తీసుకుంటారు. ఎపిపిఎస్‌సి ఛైర్మన్‌ డి గౌతమ్‌ సవాంగ్‌ విజయవాడలోని పొట్టి శ్రీరాములు చదలవాడ మల్లిఖార్జునరావు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలోని ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు.

  • 14న ఆయుష్‌ పోస్టుల సర్టిఫికెట్ల పరిశీలన

ఆయుష్‌ శాఖలోని పలు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 14న సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) కార్యదర్శి జె ప్రదీప్‌ కుమార్‌ వెల్లడించారు. యునానిలోని మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు, ఆయుర్వేద, హోమియోపతిలోని లెక్చరర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, ఈ నెల 14న ఉదయం 10 గంటలకు ఎపిపిఎస్‌సి కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.