Oct 03,2022 15:45

గాంధీనగర్‌ :  గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ జెండా ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వకున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, 36 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సావ్లీ పట్టణంలో విద్యుత్‌ స్తంభంపై జెండా ఏర్పాటు చేయడానికి మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒక దుకాణం, వాహనం ధ్వంసమైనట్లు సావ్లి ఎస్‌ఐ తెలిపారు.