Sep 27,2021 15:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గులాబ్‌ తుపాను నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వానిు కోరారు. భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయని, వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని, తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండటంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు టిడిపి నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తమ వంతు సాయం అందజేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన అనిు చర్యలూ ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.
బంద్‌పై జగన్‌ ద్వంద్వ వైఖరి : టిడిపి నేతలు
పార్లమెంటులో వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చిన జగన్‌, బంద్‌కు మద్దతివ్వడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని టిడిపి ముఖ్యనేతలు విమర్శించారు. రైతు సమస్యలపై చేపట్టిన భారత్‌ బంద్‌కుటిడిపి సంపూర్ణ మద్దతు తెలిపిందని పేర్కొన్నారు. చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతల సమావేశం సోమవారం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి విషజ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పారిశుధ్యం పడకేసిందని, నివారణకు సరైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు జగన్‌ చేస్తును ద్రోహంపై అక్టోబరు 6న హిందూపూర్‌లో సమావేశం నిర్వహించనునట్లు వెల్లడించారు. కమిషన్‌ కోసం అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్లే విద్యుత్‌ ఛార్జీలు పెంచారని విమర్శించారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా విషయంలో డిజిపి వాస్తవాలను దాచిపెడుతున్నారని ఆరోపించారు. వైసిపి నేతలే గంజాయి, గుట్కా, ఎర్రచందనం, తలనీలాలు, బియ్యం, హెరాయిన్‌ అక్రమ రవాణాకు పాల్పడుతూ రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు మైక్‌ కట్‌ చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ  సమావేశంలో నాయకులు నారా లోకేష్‌, కె.అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పయ్యావుల కేశవ్‌, పి.అశోక్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.