
రాయదుర్గం (అనంతపురం) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు హామీల అమలుకు కట్టుబడి ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. బుధవారం రాయదుర్గం పట్టణంలోని కోతిగుట్ట ప్రాంతంలో వివిధ పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం ప్రచురించిన కరపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గతంలో ఇచ్చిన హామీలు 94 శాతం నెరవేరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం పురపాలక సంఘం అధ్యక్షులు పొరాళు శిల్ప, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, వలి భాష, మున్సిపల్ కమిషనర్ బడే జబ్బార్మియా, వార్డు సభ్యులు శ్రీలక్ష్మి గోవిందరాజులు, ఫక్రుద్దీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్ర, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ రెడ్డి, పట్టణ కన్వీనర్ ముస్తాక్, తదితరులు పాల్గొన్నారు.