Jun 02,2023 23:31

ట్యాబ్‌న ప్రారంభిస్తున్న ఎంపిపి, జడ్‌పిటిసి

ప్రజాశక్తి-దర్శి : హాస్పిటల్‌ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తాళ్ళూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ల్యాబ్‌ సౌకర్యాన్ని తాళ్లూరు ఎంపిపి తాటికొండ శ్రీనివాసరావు, జిల్లా వైద్య విద్యా కమిటీ సభ్యులు, జడ్‌పిటిసి మారం వెంకటరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రయివేటు హాస్పిటల్స్‌ కంటే ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఖాదర్‌మస్తాన్‌బి, సర్పంచి చార్లెస్‌ సర్జన్‌, హాస్పిటల్‌ సిబ్బంది పాల్గొన్నారు.