May 04,2021 13:16

తిరుపతి : తనకు అన్యాయం జరిగిందంటూ... తిరుమల వెంకటేశ్వరుడి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. వెంకటేశ్వరుడి గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా... తమ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని వేణుగోపాలదీక్షితులు హైకోర్టులో సవాలు చేశారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి, రమణదీక్షితులను పేర్కొన్నారు. ఈ ఫిల్‌ ను స్వీకరించి ప్రభుత్వం, టిటిడి, రమణదీక్షితులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.