
విజయవాడ: ఆర్అండ్బి బిల్డింగ్స్‌లో హౌస్ కీపింగ్ వర్కర్లు పనులు మానివేయడంతో రాష్ట్ర ఎన్నికల కార్యాలయం సహా పలు కార్యాలయాల్లో పారిశుధ్య పనులు ఆగిపోయాయి. యశ్వంత్ ఫెసిలిటీ సర్వీస్ కాంట్రాక్టర్ నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో పనులు మానివేసి ఆర్ అండ్ బి బిల్డింగ్స్ ముందు బైఠాయించి నిరసనకు దిగారు. నాలుగేళ్లుగా కేవలం రూ.6,500 జీవితంతో పనులు చేస్తున్నారు. ఆటో లకు చార్జీలు పెట్టుకొని పనికి వస్తున్నామని, వెంటనే తమకు జీతాలు ఇప్పించాలని కోరుతున్నారు.