
ఇండోర్: విజయ్ హజరే ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో ఆంధ్రప్రదేశ్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం తమిళనాడుజట్టుపై 7 వికెట్ల తేడాతో ఆంధ్ర ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్కు దిగిన తమిళనాడు జట్టు 41.3 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో బాబా అపరాజిత్(40), సోను యాదవ్(37) మాత్రమే రాణించగా.. ఆంధ్ర బౌలర్లు స్టెఫెన్, షోయబ్ ఖాన్కు మూడేసి వికెట్లు దక్కాయి. అనంతరం అశ్విన్ హెబ్బర్(101నాటౌట్) సెంచరీతో కదం తొక్కడంతో ఆంధ్ర 29.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని(181 పరుగులు) ఛేదించింది. గ్రూప్ాఏలో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో ఛత్తీస్గడ్ను చిత్తుచేసింది. ఛత్తీస్గడ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని హైదరాబాద్ 40.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.