Mar 28,2023 00:27

హెచ్‌ఎం నరసింహ మూర్తికి దేహశుద్ధి చేస్తున్న మహిళలు

ప్రజాశక్తి-నరసరావుపేట : విద్యార్థినులతో మండలంలోని రావిపాడులో ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం నరసింహమూర్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు సోమవారం ఆందోళనకు దిగారు. 2 నెలల క్రితం ఉప్పలపాడు నుండి రావిపాడు ప్రాథమిక పాఠశాలకు ప్రమోషన్‌పై వచ్చిన నరసింహమూర్తి ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రశ్నించగా.. ఇలాంటివన్నీ ప్రభుత్వ పాఠశాలలో సహజం.. దిక్కున్నచోట చెప్పుకోండి.. అని బెదిరింపు ధోరణిలో మాట్లాడడారని స్థానికులు మండిపడ్డారు. హెచ్‌ఎంకు దేహశుద్ధి చేశారు. అనంతరం ఆయన ఎక్కడికి వేళ్లకుండా పాఠశాలకు తాళం వేసి నిర్బంధించారు. పోలీసులు పిలిపించి అప్పగించారు. విషయం తెలుసుకున్న మండల విద్యా శాఖాధికారి జ్యోతి కిరణ్‌ పాఠశాలకు చేరుకున్నారు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు నరసింహమూర్తిని పోలీసులు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా హెచ్‌ఎంకు మరో ఉపాధ్యాయిని వత్తాస పలుకుతున్నారంటూ ఆగ్రహానికి గురయ్యారు.