Jan 14,2022 21:44

యాషెస్‌ సిరీస్‌ ఐదో టెస్ట్‌
హోబర్ట్‌: యాషెస్‌ సిరీస్‌ ఐదో టెస్ట్‌లో ఆస్ట్రేలియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ ట్రివిస్‌ హెడ్‌(101) సెంచరీకి తోడు కెమరూన్‌ గ్రీన్‌(74) అర్ధసెంచరీతో మెరిసారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఐదో టెస్ట్‌లో టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు ఆసీస్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. వర్షం ఈ మ్యాచ్‌ను కొంతసేపు ఆటంక పరిచినా.. ఆ తర్వాత మ్యాచ్‌ ప్రారంభమైంది. వార్నర్‌(0), ఖవాజా(6), స్మిత్‌(0) ఘోరంగా విఫలమైనా.. లబూషేన్‌(44) రాణించాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి క్యారీ(10), స్టార్క్‌(0) క్రీజ్‌లో ఉన్నారు. ఐదు టెస్ట్‌ యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 3-0తో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకోగా.. నాల్గో టెస్ట్‌ డ్రా అయిన సంగతి తెలిసిందే.