Apr 09,2021 00:01

హెల్త్‌ కార్డులు అందజేస్తున్న జోగినాయుడు

యలమంచిలి : ఉద్యోగ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ హెల్త్‌ కార్డులు జారీ చేస్తున్నట్లు స్థానిక సబ్‌ ట్రెజరీ ఆఫీసర్‌ కర్రి జోగినాయుడు తెలిపారు. గురువారం ఆయన హెల్త్‌ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పింఛనుదారుల సంఘం అధ్యక్షులు సోమేశ్వరరావు, పూరి జగన్నాధం మాట్లాడుతూ గతంలో హెల్త్‌ కార్డులు ఎవరికి వారే డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వమే పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. పలువురు విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.