Jul 21,2021 19:19

కన్నడ సినిమా 'హీరో' చిత్రాన్ని దర్శకుడు ఎం.భరత్‌ రాజ్‌ తెలుగులోకి డబ్‌ చేశారు. రిషబ్‌ శెట్టి కథానాయకుడిగా, గనవి లక్ష్మణ్‌ నాయికగా, ప్రమోద్‌ శెట్టి విలన్‌ పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ని ఆహాలో చిత్రబృందం విడుదల చేసింది. ప్రతి సంఘటన ఉత్కంఠభరితంగా తీశారు. విలన్‌ ప్రమోద్‌ భార్యగా కథానాయిక కనిపించడం, ఆమె హీరోకి సహాయం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చివరిలో హీరో హీరోయిన్‌ని చంపడం మరింత ఉత్కంఠను రేపుతుంది. క్రైమ్‌, థ్రిల్లర్‌ నేపథ్యంలో తీసిన ఈ సినిమా ఆహాలో ఈ నెల 24న విడుదల కానుంది.