Jun 23,2021 17:12

హైదరాబాద్‌ : సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, గుంటూరుజిల్లా ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌ గల్లా హీరోగా సినీ ఇండిస్టీకి పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ 'హీరో' అని చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను, టీజర్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తాజాగా విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో స్టార్‌ సింబల్‌, గన్ను, బుల్లెట్‌, ఫిలిం రోల్‌ కనిపిస్తూ సినిమాపై భారీ అంచనాలే పెంచుతోంది. ఇక టీజర్‌లో అశోక్‌గల్లా.. కౌబారుగా కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే కౌబారు లుక్‌లోనే కాకుండా.. ఇంకా రెండు మూడు లుక్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా హీరో ట్రైన్‌పై నడుస్తున్న దృశ్యం కూడా సినిమాపై హైప్‌ని క్రియేట్‌ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో అశోక్‌కి జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తోంది. కీలకమైన పాత్రలో అగ్రహీరో జగపతిబాబు నటిస్తున్నారు. అలాగే సీనియర్‌ నరేష్‌, సత్య, అర్జన సౌందర్య కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించగా.. అమరరాజు మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.

హీరో టీజర్  : https://youtu.be/R67XtVakJZ0