
ప్రజాశక్తి - పర్చూరు
హిందీ వారోత్సవాలలో భాగంగా మండలంలోని ఉప్పుటూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హిందీ దస్తూరి పోటీలు నిర్వహించారు. హిందీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు హనుమంతరావు సేకరించిన ప్రాచీన హిందీ కవుల చిత్రపటాల పుస్తకాలను హెచ్‌ఎం వసుంధర దేవి, వైఆర్ పాఠశాల హెచ్‌ఎం రాజశేఖర్ ఆవిష్కరించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు భాష సమస్య వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు హిందీ నేర్చుకుంటే ఆ సమస్య ఉండదన్నారు. హిందీ భాషలో అనేక ఉపాధి అవకాశాలు వుంటాయని అన్నారు. కేంద్రప్రభుత్వం నిర్వహించే పోటీపరీక్షలకు హిందీ తప్పనిసరని తెలిపారు. విద్యార్థులకు బహుమతులు అందచేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.