Nov 24,2021 21:57

బాలి: ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ా1000 టోర్నీలో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, పివి సింధు హోరాహోరీ పోరులో గెలుపొందగా.. డబుల్స్‌లో మాత్రం భారత షట్లర్లు రెండోరోజూ నిరాశపరిచారు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో పివి సింధు 17-21, 21-17, 21-17 తేడాతో ఒహోరి(జపాన్‌)ను చిత్తుచేసింది. తొలి సెట్‌ను కోల్పోయిన సింధు.. ఆ తర్వాత రెండు సెట్‌లలోనూ పుంజుకొని ప్రత్యర్ధిని ఓడించడం విశేషం. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-15, 19-21, 21-17 తేడాతో భారత్‌కే చెందిన హెచ్‌ఎస్‌ ప్రణరుపై పోరాడి నెగ్గాడు. మరో పోటీలో బి సాయి ప్రణీత్‌ 21ా19, 21ా18తో జూనియర్‌ పొపొవ్‌ను ఓడించి రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధృవ్‌ కపిలాసిక్కిరెడ్డి జోడీ 21-7, 21-12తో జపాన్‌కు చెందిన యమషిటాాషినోయాను చేతిలో, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పాసిక్కిరెడ్డి 27-29, 18-21 తేడాతో జోడీ 5వ సీడ్‌ గాబ్రిల్లాాస్టెఫానీల చేతిలో ఓడారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ మరో ఉత్కంఠ పోటీలో సుమిత్‌ాఅశ్విని పొన్నప్ప జోడీ 24-22, 12-21, 19-21 తేడాతో జపాన్‌కు చెందిన టకూరోామత్స్యుయమ చేతిలో పోరాడి ఓడారు.