
న్యూఢిల్లీ : హర్యానాలోని కర్నాల్ నగరంలోని ఒక పాఠశాలకు చెందిన హాస్టల్లోని 54 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కర్నాల్‌లోని ఒక పాఠశాలలో సోమవారం ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందని అదికారులు తెలిపారు. అనంతరం హాస్టల్లోని విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించామని, 54 మందికి కరోనా సోకినట్లు తెలిసిందని అధికారులు తెలిపారు. దీంతో హాస్టల్ భవనాన్ని మూసివేసి, కంటైన్మెంట్జోన్గా ప్రకటించామని అన్నారు. కాగా, ప్రతి పాఠశాలను మూడు విభాగాలుగా విభజించామని, ఒకవేళ ఒక విభాగంలోని విద్యార్థికి కరోనా సోకినట్లైతే.. ఆ విభాగాన్ని పదిరోజుల పాటు మూసివేయాలని.. పాఠశాల మొత్తాన్ని శానిటైజ్ చేయాల్సిందిగా ఫిబ్రవరి 22న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని అధికారులు తెలిపారు. ఒక విభాగంలోని అధిక శాతం మంది కరోనా బారిన పడినట్లైతే.. ఏకంగా పాఠశాలను మూసివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 9 నుండి 12 తరగతులకు గతేడాది డిసెంబర్ నుండి క్లాసులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. 3 నుండి 5 తరగతులకు ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమయ్యాయి.