Jul 29,2021 17:40

హుజురాబాద్‌ : ఉప ఎన్నిక జరగనున్న హుజురాబాద్‌లో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హుజూరాబాద్‌ అంబేద్కర్‌ కూడలిలో తెరాస, భాజపా వర్గీయులు ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీలను కించపరిచేలా ఈటెల జమున సోదరుడు మధుసూదన్‌ వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో ఈటెల జమున గురువారం హుజూరాబాద్‌ చేరుకొని అక్కడ అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న సమయంలో.. టిఆర్‌ఎస్‌, బిజెపి వర్గాల మధ్య వాగ్వాదం జరిగి గొడవలకు దిగాయి. మధుసూదన్‌ కావాలని.. ఎస్సీలను కించపరిచేవిధంగా మాట్లాడరని తెరాస వర్గీయులు ఆరోపించగా.. వాటిని తెరాస వర్గీయులే సృష్టించారని భాజపా కార్యకర్తలు ఆరోపించారు. దీంతో అక్కడున్న తెరాస వర్గీయులు, బిజెపి వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సిఎం కెసిఆరర్‌ ప్లెక్సీలు తగలబెట్టేందుకు భాజపా శ్రేణులు యత్నంచారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భాజపా కార్యకర్తలను, తెరాస వర్గీయులను అక్కడ నుంచి పంపించారు.