May 17,2022 21:49

విద్యుత్‌ ఛార్జీంగ్‌ స్టేషన్ల ఏర్పాటు
న్యూఢిల్లీ :
దేశ వ్యాప్తంగా విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి టాటా పవర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు  హ్యుందాయ్ మోటార్‌ ఇండియా వెల్లడించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన డీలర్‌షిప్‌ కేంద్రాల్లో ఇవి ఫాస్ట్‌ చార్జింగ్‌ మౌలిక వసతులను టాటా పవర్‌ ఏర్పాటు చేయనుంది. ఈ భాగస్వామ్యంలో 29 నగరాల్లోని 34 విద్యుత్తు వాహన డీలర్షిప్‌ల్లో 64 కెడబ్ల్యు డిసి చార్జీంగ్‌ స్టేషన్లను అందుబాటులోకి తేనున్నారు. స్థలం, నిర్వహణ వసతులను  హ్యుందాయ్ అందించగా.. టాటా పవర్‌ ఛార్జింగ్‌ స్టేషన్ల మెయింటెనెన్స్‌, ఆపరేషన్లను చూసుకోనుంది.