Sep 22,2022 07:16

వంటింట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా నూనె చిట్లడం, కుక్కర్‌ స్టీమ్‌ రావడం, వేడి పాత్రలు తాకడం వంటి కారణాల వల్ల చేతులు కాలుతూనే ఉంటాయి. చిన్న చిన్న గాయాలు, బొబ్బలు, మచ్చలు నివారించడానికి ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. అయితే గాయమైన వెంటనే చల్లని నీటితో కడిగి ఆరాకే రెమెడీలను పాటించాలి. పెద్దవైతే మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.

  • ఐస్‌ప్యాక్‌ : ఐస్‌ను నేరుగా గాయాల మీద రుద్దకూడదు. ఐస్‌ప్యాక్‌ గాయం చుట్టూ రుద్దడం వల్ల ఆ ప్రభావం గాయానికి చేరి ఉపశమనం కలిగిస్తుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
  • లావెండర్‌ ఆయిల్‌ : రెండు చుక్కల లావెండర్‌ ఆయిల్‌ను క్రమం తప్పకుండా కాలిన గాయాల మీద రాస్తూవుంటే ఫలితముంటుంది.

టూత్‌ పేస్ట్‌ : గాయాన్ని కడిగి, చర్మం ఆరాకే టూత్‌పేస్ట్‌ అప్లరు చేయాలి. పుదీనా ఫ్లేవర్‌ వైట్‌ కలర్‌ టూత్‌పేస్ట్‌ అయితే గాయం త్వరగా మానుతుంది.
వెనిగర్‌ : వెనిగర్‌ను నేరుగా రాయొద్దు. నీటిలో కలిపి అప్లరు చేయడం వల్ల చల్లని అనుభూతి కలుగుతుంది.
తేనె : యాంటిసెప్టిక్‌ గుణం కలిగిన తేనె మంటను తగ్గించి గాయాన్ని మాన్పుతుంది.
అలొవెరా : దీనిలోని కెమికల్‌ కాంపౌండ్‌ మంటను తగ్గించి, గాయాన్ని మాన్పుతుంది. మచ్చలూ ఏర్పడవు.
ఎగ్‌వైట్‌ : ఎగ్‌ వైట్‌ను బీట్‌ చేసి గాయంపై రాస్తే నొప్పి, వాపు తగ్గుతాయి.
పసుపు : యాంటీ ఆక్సిడెంట్లు గల పసుపు కాలిన గాయాన్ని వెంటనే నయం చేస్తుంది. వాపు, మచ్చలు తగ్గుతాయి. టేబుల్‌ స్పూన్‌ పెరుగులో చిటికెడు పసుపు కలిపి అప్లరు చేస్తే మంచి ఫలితముంటుంది.
టీబ్యాగ్‌ : టీబ్యాగ్‌ను కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత గాయంపై ఉంచాలి. ఇది చర్మాన్ని టైట్‌గా చేసి, డ్యామేజైన కణాలను తొలగిస్తుంది.
కొబ్బరినూనె - నిమ్మరసం : నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు గాయాన్ని నయంచేసి, కొత్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి మసాజ్‌ చేస్తుంటే అందులోని పోషకాలను చర్మం గ్రహిస్తుంది.
బొప్పాయి : ఇది కాలిన గాయాలకు ఎఫెక్టివ్‌ రెమెడీ. బాగా పండిన బొప్పాయిలోని యాంటీఫాలజిస్టిక్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు మంట, గాయాలను మాన్పుతాయి.
బంగాళాదుంప : దీనిలో బ్లీచింగ్‌ ప్రాపర్టీస్‌ ఎక్కువ. బంగాళాదుంపను ముక్కతో చర్మంపై క్లాక్‌ వైజ్‌, యాంటీ క్లాక్‌ వైజ్‌గా రబ్‌ చేస్తూ ఉంటే మచ్చలు పోతాయి.
పాలు, పెరుగు : చల్లటి పాలలోని ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం స్కిన్‌ టిష్యూస్‌ని మెరుగుపరిచి, మచ్చలను తగ్గిస్తాయి. కాటన్‌ బాల్‌ని పచ్చిపాలలో ముంచి గాయంపై ఉంచాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. చల్లని, తాజా పెరుగునూ రాయొచ్చు.