
న్యూఢిల్లీ : ఢిల్లీ ముసినిపల్ హౌస్‌లో మంగళవారం సమావేశం రసాభాసాగా మారింది. బిజెపి తీరును వ్యతిరేకిస్తూ ఆప్ సభ్యులు ఆందోళనకు దిగడంతో మొదటిసమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం సమావేశానికి భారీ భద్రతాదళాలతో పాటు మార్షల్స్‌ను మోహరించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులు మొదట ప్రమాణస్వీకారం చేయడాన్ని ఆప్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రిసైడింగ్ అధికారి సత్యశర్మ ఎన్నికైన ఆప్ సభ్యులను కాకుండా ఎల్జి నామినేట్ చేసిన సభ్యులతో ముందుగా ప్రమాణ స్వీకారం చేయించడం సిగ్గు చేటు అంటూ ఆప్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు, సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ఈ చర్యపై ఆప్ కౌన్సిలర్ ముఖేష్ గోయల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నామినేట్ సభ్యులు ఓటు వేసేందుకు అనుమతించమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆప్ సభ్యులు జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై, అంటూ నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోకుండానే సమావేశాన్ని సత్యశర్మ వాయిదా వేశారు.
డిసెంబర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్( ఎంసిడి ) ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్(126)ను దాటి.. ఆప్ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. ఆప్ తరఫున షెల్లీ ఒబెరాయ్ మేయర్ పదవికి పోటీ పడుతున్నారు.