Oct 05,2022 09:12

ఇంటర్నెట్ : దసరా పండుగ రోజు బంగారం ప్రేమికులకు షాక్ తగిలింది. బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.47,350కి చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.51,660గా ఉంది. కిలో వెండి ధర రూ.4,200 పెరిగి రూ.66,700కి చేరింది. ఏపీ, తెలంగాణలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో రూ.47,500, ముంబైలో రూ.47,350గా పలుకుతోంది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820గా నమోదైంది.  ఆర్ధిక రాజధాని ముంబైలో రూ.51,660గా ఉంది.