
ప్రజాశక్తి మంత్రాలయం : ప్రభుత్వ ద్వారా నిర్మితమైన పేదోడి సొంతింటిని వైసిపి యువనేత ప్రదీప్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీకి సమీపంలో సూగూరు రహదారిలోని జగనన్న కాలనీలో నిర్మించిన కటికె నసీమ రాజా సాబ్ దంపతులకు చెందిన ఇంటిని రిబ్బన్ కట్ గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదోడి సొంతింటి కల సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీల నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పేదవాడి సోంతింటి కల నేరవేర్చిన ఘనత సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇంటి స్థలం తో పాటు, ఇళ్లు మంజూరు చేసిందని లబ్దిదారుల ఆహ్వానం మేరకు గృహ ప్రవేశం చేశామని తెలిపారు. ఏపీలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం అదే కాలన్నీల్లో నిర్మాణం లో ఉన్న ఇళ్ల పునాదులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి మండల నాయకులు బూదూరు లక్ష్మి నారాయణ రెడ్డి, మద్దిలేటి, వైసిపి పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.