Aug 18,2022 23:20

రైతుతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి లీలావతి

ప్రజాశక్తి -కశింకోట
ఈ క్రాప్‌ నమోదు వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి లీలావతి ఆదేశించారు. కసింకోటలో ఈ-క్రాప్‌ నమోదును గురువారం ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా సిబ్బంది పనితీరుని పర్యవేక్షించారు. రైతులు తప్పనిసరిగా ప్రతి పంటను నమోదు చేసుకోవాలన్నారు. పంటనమోదు చేయించుకోకపోతే పంట నష్టపరిహారం, క్రాప్‌ ఇన్సూరెన్స్‌, ధాన్యం కొనుగోలు, ఇతర పథకాలు వర్తించవని పేర్కొన్నారు.
దేవరాపల్లి : పాస్‌ పుస్తకం కలిగిన ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలని తహశీల్దారు ఎం.లక్ష్మి అన్నారు. మండలంలోని తారువ గ్రామంలో గురువారం వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో చేస్తున్న పంట నమోదు కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి వై.కాంతమ్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ-క్రాప్‌ చేయించుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వ అందించే పంటల బీమా, ఇతర పథకాలు వర్తిస్తాయని చెప్పారు. అనంతరం వ్యవసాయాధికారి రైతులకు సలహాలు సూచనలు చేశారు. ఏఈఓ కిరణ్‌ కుమార్‌, రైతు భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.