Sep 13,2021 19:35

పైసా వసూల్‌', 'రాగల 24 గంటల్లో' చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ ముస్కాన్‌ సేథి.. ప్రస్తుతం 'మరో ప్రస్థానం' సినిమాలో తనీష్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని దర్శకుడు జానీ తెరకెక్కించారు. హిమాలయ స్టూడియో మాన్షన్స్‌, ఉదరుకిరణ్‌ సమర్పణలో 'మిర్త్‌' మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం సెప్టెంబర్‌ 24న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా నటి ముస్కాన్‌ సేథి మీడియాతో ముచ్చటించింది.
'మరో ప్రస్థానం చిత్రం నాకు వెరీ వెరీ స్పెషల్‌ మూవీ. ఈ చిత్రంలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పాను. ఈ చిత్రంలో కొన్ని రోజులు రాత్రి, పగలూ అనే తేడా లేకుండా షూటింగ్‌ చేశాం. ఇది ఒక ఎమోషనల్‌ ఫిల్మ్‌. ఇందులో నేను యాక్షన్‌ సీన్స్‌లో కూడా నటించాను. ఫస్ట్‌ టైమ్‌ ఇటువంటి క్యారెక్టర్‌ చేయడం వలన నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. అయితే.. డైరెక్టర్‌ జానీ సార్‌ డైలాగ్స్‌, ఎమోషన్స్‌ చూపించడంలో సహాయం చేశారు. ఈ కథ అంతా ఒక రోజులోనే జరుగుతుంది. ప్రతి సీన్‌ చాలా రియాలిటీగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం నాకు ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది' అని అన్నారు.