Nov 22,2021 14:16

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కరోనావ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత.. అందరూ హడావిడి, బిజీ లైఫ్‌లోకి వెళ్లిపోయారు. వారాంతంలో కాస్త రిలీఫ్‌ పొందడానికి అందరూ సినిమాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఇక కరోనా వల్ల ప్రేక్షకులకు ఓటీటీ కూడా పరిచయమైంది. థియేటర్ల దాకా వెళ్లే టైం లేకపోతే.. ఓటీటీలోనే సినిమాలని చూస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చిత్రాన్ని వీక్షించడానికి ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ వారం థియేటర్లలోనూ. ఓటీటీలోనూ ఏయే సినిమాలు విడుదలవుతాయో తెలుసుకుందామా..!

'అనుభవించు రాజా'తో వస్తోన్న రాజ్‌తరుణ్‌
యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న రాజ్‌తరుణ్‌.. 'అనుభవించు రాజా' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ నవంబర్‌ 26న థియేటర్లలో విడుదల కానుంది. ప్రేమ కథతోపాటు.. గ్రామీణ నేపథ్యాన్ని జోడించి తెరకెక్కిన చిత్రమిది. ఇందులో రాజ్‌తరుణ్‌కి జోడీగా కషికా ఖాన్‌ నటించారు. ఈ చిత్రానికి శ్రీను గావిరెడ్డి దర్శకత్వం వహించగా.. అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించాయి. గోపీ సుందర్‌ సంగీతాన్ని అందించారు.

sampu 1


సంపూర్ణేష్‌బాబు కామెడీ కథ 'క్యాలీఫ్లవర్‌'
'హృదయకాలేయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్‌బాబు.. మరో కామెడీ కథ 'క్యాలీఫ్లవర్‌' చిత్రంలోనూ నటించాడు. 'శీలో రక్షతి రక్షిత: అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్ర టీజర్‌ని చూస్తే మరోసారి సంపూ నవ్వులు పూయిస్తాడనే అర్థమౌతుంది. ఈ చిత్రంలో టాలీవుడ్‌ ప్రముఖ నటులు పోసాని కృష్ణమురళి, పృథ్వీ కీలకపాత్రలో పోషించారు. ఈ చిత్రాన్ని ఆర్కే మలినేని డైరెక్ట్‌ చేయగా.. ఆశాజ్యోతి నిర్మించారు. ఈ చిత్రం నవంబరు 26న థియేటర్లలో విడుదల కానుంది.

loop 1


తమిళ 'మానాడు'.. తెలుగులో లూప్‌
కోలీవుడ్‌ స్టార్లు తెలుగులోనూ తమ మార్కెట్‌ను సంపాదించుకున్న నటుల్లో శింబు ఒకరు. విభిన్నమైన కథాంశాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన తాజాగా పాన్‌ ఇండియా చిత్రంలో నటించారు. ఇది తమిళంలో 'మానాడు'.. తెలుగులో 'ది లూప్‌'గా రాబోతుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. ఇందులో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్‌ నటించగా... సంగీతం యువన్‌ శంకర్‌ రాజా అందించారు. ఈ చిత్రం నవంబర్‌ 25న థియేటర్లలో విడుదల కానుంది.

hindi 1


సత్యమేవ జయతే 2
జాన్‌ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం 'సత్యమేవ జయతే'. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా.. 'సత్యమేవ జయతే 2' వస్తోంది. ఈ సినిమా వచ్చే నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. మిలాప్‌ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యా కోస్లా కుమార్‌ ఓ కీలక పాత్రలో నటించారు.

antihim


'అంతిమ్‌'లో పోలీస్‌ ఆఫీసర్‌గా సల్మాన్‌
బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ హరోగా.. 'అంతిమ్‌ : ది ఫైనల్‌ ట్రూత్‌' చిత్రంలో నటించారు. ఈ సినిమాలో సల్మాన్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసుల మధ్య జరిగే పోరాట నేపథ్యమున్న కథాంశంగా తెరకెక్కిందని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఇందులో ఆయుష్‌ శర్మ కీలకపాత్ర పోషించాడు. మహేశ్‌ వి.మంజ్రేకర్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 26న థియేటర్‌లలో విడుదల కానుంది.

ఇక తెలుగులోనే చిన్న సినిమాలకొస్తే..

హీరోగా మారిన షకలక శంకర్‌
తెలుగులో ఈటీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్దస్త్‌' ప్ర్రోగ్రామ్‌ ద్వారా కమెడియన్‌గా పరిచయమైన షకలక శంకర్‌.. 'కార్పొరేటర్‌' మూవీలో హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని సంజరు పునూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సునీత పాండే, లావణ్య వర్మ, కస్తూరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కామెడీతోపాటు, రాజకీయ సందేశంతో ఈ మూవీ నవంబర్‌ 26న థియేరట్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

saknar 2వాస్తవ ఘటనల ఆధారంగా 'ఆశా ఎన్‌కౌంటర్‌'
యావత్‌ భారత్‌ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన నిర్భయ ఘటన మాదిరిగానే.. హైదరబాద్‌లోనూ జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఆశ ఎన్‌కౌంటర్‌'. ఈ చిత్రాన్ని ఆనంద్‌ చంద్ర తెరక్కెక్కించగా.. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 26న విడుదల కానుంది.

'భగత్‌సింగ్‌ నగనగరంలో ఓ ప్రేమ కథ
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న యదార్థ సంఘటనల ఆధారంగా.. భగత్‌సింగ్‌ రాసిన ఓ లైన్‌ను ఆదర్శంగా తీసుకొని ఈ చిత్రాన్ని వాలాజా క్రాంతి తెరకెక్కించారు. ఈ మూవీలో విదార్థ్‌, ధృవీక జంటగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో నవంబర్‌ 26న థియేటర్లలో విడుదల కానుంది.


ఓటీటీలో...
రజనీకాంత్‌ నటంచిన 'పెద్దన్న' మూవీ ఈ నెల 26న నెట్‌ప్లిక్స్‌లో విడుదల కానుంది. ఇక వెంకటేష్‌ హీరోగా నటించిన దృశ్యం ఎంతటి సంజలన విజయం సొంతం చేసుకుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ మూవీ సీక్వెల్‌గా రాబోతున్న 'దృశ్యం 2' ఓటీటీలో నవంబర్‌ 25న అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ కానుంది. ఇక టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్‌ కుమారుడు ఆకాష్‌పూరీ నటించిన 'రొమాంటిక్‌' మూవీ ఓటీటీ 'ఆహా'లో ఈ నెల 26న స్ట్రీమింగ్‌ కానుంది. అలాగే సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన 'రిపబ్లిక్‌' మూవీ కూడా ఓటీటీ 'జీ 5'లో నవంబర్‌ 26న రిలీజ్‌ కానుంది.

 vekatesh