Jun 02,2023 21:20

నేలకొరిగిన అరటి చెట్లను చూపుతున్న రైతు

           ప్రజాశక్తి-బెలుగుప్ప   మండల పరిధిలోని గంగవరం గ్రామంలో గురువారం రాత్రి కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి పంట నేలకొరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రైతు చింబిలి రంగయ్య ఆరెకరాల్లో రూ.లక్షలు ఖర్చు పెట్టి అరటి పంటను సాగు చేశాడు. పంట కోత దశలో ఉంది. ఈనేపథ్యంలో వీచిన ఈదురుగాలులు, వర్షానికి పంట మొత్తం నేలకొరిగిందని బాధిత రైతు వాపోయాడు. ఫలితంగా దాదాపు రూ.15లక్షల నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని కోరారు.